Share News

Palamuru Project: భూత్పూర్‌, పరిగి, మాల్‌లో బహిరంగ సభలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 08:07 AM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడాన్ని నిరసిస్తూ.. ప్రజల మద్దతుతో పోరాటం సాగించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది

 Palamuru Project: భూత్పూర్‌, పరిగి, మాల్‌లో బహిరంగ సభలు

  • ‘పాలమూరు’ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ పోరు బాట

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడాన్ని నిరసిస్తూ.. ప్రజల మద్దతుతో పోరాటం సాగించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌, వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, నల్లగొండ జిల్లాలోని మాల్‌లో త్వరలో భారీ బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామని, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మూడు చోట్ల భారీ బహిరంగ సభలను చేపట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక్కో చోట 10 రోజుల వ్యత్యాసంతో ఈ సభలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. కాగా, బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉప నేతలుగా ఎంపికైన హరీశ్‌రావు, సబిత, మండలి ఉప నేతలుగా ఎంపికైన ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, మండలి విప్‌గా నియమితులైన దేశపతి శ్రీనివాస్‌ బుధవారం పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 01 , 2026 | 08:08 AM