Share News

కడియం కావ్యపై ఎస్‌ఈసీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:25 AM

మునిసిపల్‌ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా వరంగల్‌ ఎంపీ కడియం కావ్య 2చోట్ల ఓటు నమోదు చేసుకున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది.

కడియం కావ్యపై ఎస్‌ఈసీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా వరంగల్‌ ఎంపీ కడియం కావ్య 2చోట్ల ఓటు నమోదు చేసుకున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) కార్యాలయంలో ఆ పార్టీ ప్రతినిధులు కిశోర్‌గౌడ్‌, లలితారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎంపీ కావ్య వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎక్స్‌-అఫీషియో సభ్యురాలిగా ఉండగా, ఇప్పుడు తొర్రూరులో కూడా ఎక్స్‌-అఫీషియో సభ్యురాలిగా నమోదు చేయించుకున్నారన్నారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కు వస్తుందని, నిబంధనల ప్రకారం 30 రోజుల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే నమోదు పూర్తి చేసి ఓటు వేయడానికి సిద్ధపడటం చట్టరీత్యా చెల్లదన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 07:26 AM