BRS leader Harish Rao: ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్‌లో చేరిన ద్రోహి రేవంత్
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:44 AM
ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులతో పట్టుబడ్డ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ తన జన్మంతరం ద్వేషించిన కాంగ్రె్‌సలో చేరిన రేవంత్ టీడీపీకి ద్రోహం చేశారు.
ద్రోహబుద్ధి ఆయన డీఎన్‌ఏలోనే ఉంది: హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులతో పట్టుబడ్డ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ తన జన్మంతరం ద్వేషించిన కాంగ్రె్‌సలో చేరిన రేవంత్ టీడీపీకి ద్రోహం చేశారు. అడుగడుగునా వెన్నుపోట్లు.. అనుక్షణం ద్రోహబుద్ధి అనేది ఆయన డీఎన్‌ఏలోనే ఉంది. ఖమ్మంలో సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’’ అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని, ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడమంటే.. అది రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమేనని, ఇది నేరాన్ని ప్రోత్సహించడం కాదా? అని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను వ్యతిరేకిస్తుంటే.. రేవంత్‌మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్నారని, టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు.