Yeleti Maheshwar Reddy: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లే తెలంగాణ ద్రోహులు
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:38 AM
రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు...
బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై చర్చకు అవకాశం లే కుండా చేయటమే ఆ రెండు పార్టీల అంతర్గత వ్యూహమని విమర్శించారు. ఒక్కో అంశంపై చర్చ జరిగితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు కూడా తెరపైకి వస్తాయని అన్నారు. బుధవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. శాసనసభకే సరిగా హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్.. కృష్ణా జలాలపై ఆరోపణలు చేస్తే, అదే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలే తెలంగాణకు మొదటి ద్రోహులని ఆరోపించారు.