Share News

kumaram bheem asifabad-వంతెన పనులు నాణ్యతగా చేపట్టాలి

ABN , Publish Date - May 06 , 2026 | 11:32 PM

దిందా వాగుపై చేపడతున్న హైలెవల్‌ వంతెన పనులు నాణ్యతగా చేపట్టాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. వంతెన పనులు చేపడుతున్న తీరును పరిశీలించి బుధవారం స్థానికుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఏటా ఇబ్బందులు పడుతున్నామని వారు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు

kumaram bheem asifabad-వంతెన పనులు నాణ్యతగా చేపట్టాలి
దిందా వంతెన పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

చింతలమానేపల్లి, మే 6 (ఆంధ్రజ్యోతి): దిందా వాగుపై చేపడతున్న హైలెవల్‌ వంతెన పనులు నాణ్యతగా చేపట్టాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. వంతెన పనులు చేపడుతున్న తీరును పరిశీలించి బుధవారం స్థానికుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఏటా ఇబ్బందులు పడుతున్నామని వారు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. వంతెన నిర్మాణం పూర్తైతే ఇబ్బందులు తొలగిపొతాయని చెప్పారు. వంతెన పనులు శరవేగంగా చేపట్టాలని, ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతీ రోజు పర్యవేక్షించాలని సూచించారు. ఈ వంతెన పూర్తి అయితే గ్రామస్థులు చాలా కాలం నుండి ఎదుర్కొంటున్న రవాణా సమస్య తీరిపోతుందన్నారు. సంబంధిత అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన సేవలు అందించాలి

ప్రాథమిక కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది సమయ పాలన పాటించి ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. రవీంద్రనగర్‌లో గల గంగాపూర్‌ బాబాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్‌, మందుల నిల్వ, వార్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలిం చారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఆస్పత్రిలో సరిపడా మందుల నిల్వలు ఉంచుకోవాలని చెప్పారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సూపర్‌ వైజర్లుతమ పరిధిలోని గ్రామాలను ప్రతి రోజు సందర్శించి గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితిని వైద్య సేవల వివరాలను నమోద చేయాలని సూచించారు. సిబ్బంది సమయ పాలన పాటించకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట మెడికల్‌ ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ్ల కలెక్టర్‌ కె హరిత అన్నారు. సిర్పూర్‌(టి) మండలం పెద్దబండ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును బుధవారం కలెక్టర్‌ అకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రల నుంచి వరిధాన్యం అక్రమంగా రవాణా అయ్యే అవకాశం ఉందన్నారు. వాహనాలను తనిఖీ చేసి పత్రాలను పరిశీలించలన్నారు. మత్తు పదార్థల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచిచారు.. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డి మందుల రవాణా జరిగే అవకాశం ఉన్నందున విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్‌ సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - May 06 , 2026 | 11:32 PM