Share News

కౌంటర్‌ దాఖలుకు ఇదే చివరి అవకాశం

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:17 AM

ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో 11 ఎకరాల కేటాయింపుపై కౌంటర్‌ దాఖలు చేయనందుకు బీఆర్‌ఎస్‌పై...

కౌంటర్‌ దాఖలుకు ఇదే చివరి అవకాశం

  • కోకాపేట భూములపై బీఆర్‌ఎస్‌కు హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో 11 ఎకరాల కేటాయింపుపై కౌంటర్‌ దాఖలు చేయనందుకు బీఆర్‌ఎస్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చిట్టచివరి అవకాశంగా మూడువారాలపాటు గడువు ఇస్తున్నామని స్పష్టంచేసింది. రూ.1100 కోట్ల విలువ చేసే భూమిని నామమాత్రపు ధరకు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిల్ప్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం.. కాంగ్రెస్‌ పార్టీకి భూకేటాయింపులను పిటిషనర్లు ఎందుకు ప్రశ్నించలేదన్న వ్యాఖ్యకు స్పందించింది. రెండు తప్పులు ఒక్కటైనా అది ఒప్పు కాబోదని వ్యాఖ్యానించింది.

Updated Date - Mar 17 , 2026 | 05:17 AM