Share News

kumaram bheem asifabad- ‘ఆత్మ’కు ఊపిరి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:14 PM

పదేళ్లుగా నిధులు లేక నిలిచిపోయిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎంఏ) కార్యకలాపాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మళ్లీ జీవం పోశాయి. 2025-26ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాకు నిధులు విడుదల కావడంతో రైతులకు శిక్షణ కార్యక్ర మాలు ముమ్మరం కానున్నాయి. జిల్లాకు మొత్తం రూ.7.65లక్షల నిధులు మంజూరయ్యాయి, వ్యవసా యంలో సాంకేతిక పరిజ్ఞాణంతో పాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై అవగాహన కల్పించేం దుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్ధ(ఆత్మ)కు ప్రభుత్వం ఊపిరి పోసింది.

kumaram bheem asifabad- ‘ఆత్మ’కు ఊపిరి
లోగో

- పదేళ్ల తరువాత జిల్లాకు రూ.7.65లక్షల నిధులు విడుదల

- రైతులకు శిక్షణ, కిసాన్‌ మేళా కోసం ఖర్చు

బెజ్జూరు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పదేళ్లుగా నిధులు లేక నిలిచిపోయిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎంఏ) కార్యకలాపాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మళ్లీ జీవం పోశాయి. 2025-26ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాకు నిధులు విడుదల కావడంతో రైతులకు శిక్షణ కార్యక్ర మాలు ముమ్మరం కానున్నాయి. జిల్లాకు మొత్తం రూ.7.65లక్షల నిధులు మంజూరయ్యాయి, వ్యవసా యంలో సాంకేతిక పరిజ్ఞాణంతో పాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై అవగాహన కల్పించేం దుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్ధ(ఆత్మ)కు ప్రభుత్వం ఊపిరి పోసింది. నిధుల లేమితో పదేళ్లుగా నిస్తేజంగా ఉన్న ఆత్మకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు కేటాయిం చింది. దీంతో తిరిగి రైతు శిక్షణ కార్యక్రమాలు, కిసాన్‌ మేళాలు, విజ్ణాణ యాత్రలు, క్షేత్ర పర్యట నలు కొనసాగించే అవకాశం ఏర్పడింది.

- మూడు నెలలకోసారి..

ఆత్మ పథకంలో భాగంగా ఏర్పాటు చేసే గవ ర్నింగ్‌ బోర్డు మూడు నెలలకోసారి సమావేశమై ప్రగ తి నివేధికలను సమీక్షిస్తుంది. అవసరమైన బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. బ్లాక్‌ స్థాయిలో ఆత్మ కింద ఫార్మర్‌ ఇన్పర్మేషన్‌ అండ్‌ అడ్వయిజరీ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. జిల్లాలోని వ్యవసాయ డివిజన్లలో వ్యవసాయ సహాయ సంచాలకులు కన్వీనర్‌గా ఉంటారు. ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఎఫ్‌ఏసీ(ఫార్మర్‌ అడ్వయిజరీ కమిటీ)ల్లో 11నుంచి 15మంది హహిళలు, రైతు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. నెలకోసారి సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటుంది.

- బ్లాక్‌, జిల్లా స్థాయిలో..

ఈ సంస్థ ద్వారా బ్లాక్‌, జిల్లా స్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతులను వ్యవ సాయ విజ్ఞాణ యాత్రలకు పంపించి పంట క్షేత్రాల ను పరిశీలింపజేస్తారు. కిసాన్‌ గోష్టి నిర్వహిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాణ కేంద్రాల ద్వారా సాగులో ఆధునిక పద్దతులపై రైతులకు తెలుపుతారు. ప్రస్తుతం వ్యవసాయం ఆధునిక పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో విజ్ఞాణ యాత్రలు రైతులకు మేలు చేయనున్నాయి. ఏ ప్రాంతంలో వ్యవసాయంలో ఎలాంటి పరికరాలు వాడుతున్నారు, అవి తమ ప్రాంతాల్లో వాడొచ్చా అనే విషయాన్ని రైతులు తెలుసుకుంటారు.

- 2005లో కేంద్ర ప్రభుత్వం..

అగ్రికల్చర్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ(ఆత్మ) ను 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రారం భించింది. రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాల విష యంలో శిక్షణతో పాటు నూతన వ్యవసాయ పద్ధతు లను వివరించడం వంటి కార్యక్రమాలను చేసేం దుకు కేంద్రంద్వారా 40శాతం నిధులు కేటాయిం చేవారు. ఈ సంస్థ ద్వారా రైతులకు శిక్షణ తరగ తులు నిర్వహించేవారు. వ్యవసాయ విజ్ఞాన యాత్రలతో పాటు క్షేత్రస్థాయిలో పంటల పరిశీ లన, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యవసా య, ఉద్యాన, మత్స్య, పశుసంవర్దక, పట్టు పరిశ్రమ, మార్కెటింగ్‌ శాఖల భాగస్వామ్యంతో రైతులకు శిక్షణ ఇచ్చేవారు. కానీ పదేళ్లుగా ఆత్మకు నిధులు కేటా యించకపోవడంతో ఆత్మ కమిటీలన్నీ నిర్వీర్యమ య్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రైతులకు ఇబ్బందులు తొలగిపోనున్నా యని చెబుతున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:14 PM