Share News

బీపీకి ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు!

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:49 AM

రక్తపోటు (బీపీ) నియంత్రణకు ఇక రోజూ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు! ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చేయించుకుంటే చాలు...

బీపీకి ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు!

  • శాస్త్రవేత్తల పరిశోధనల్లో సత్ఫలితాలు: లాన్సెట్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రక్తపోటు (బీపీ) నియంత్రణకు ఇక రోజూ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు! ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చేయించుకుంటే చాలు! ఇవి సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ‘లాన్సెట్‌’ ఓ వ్యాసం ప్రచురించింది. దాని ప్రకారం.. అమెరికాకు చెందిన రోష్‌ అండ్‌ అల్నైలమ్‌ ఫార్మాస్యూటికల్స్‌.. ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో జిలెబెసిరన్‌ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉంది. ఇది బీపీకి ప్రధాన కారణమైన, కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే యాంజియోటెన్సినోజెన్‌ అనే ప్రొటీన్‌కు అడ్డుకట్ట వేస్తుంది. ఒక ఇంజెక్షన్‌ చేస్తే 6 నెలల పాటు సమర్థంగా పనిచేసినట్టు పరిశోధనల్లో గుర్తించారు.

Updated Date - Feb 16 , 2026 | 02:49 AM