బ్రహ్మయ్యా.. ‘మంత్రివర్యా’?
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:02 AM
ఫొటోలో అచ్చంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాదిరిగా ఉన్న ఈయన పేరు బ్రహ్మయ్య. ఊరు నల్లగొండ. జిల్లా కేంద్రంలోని...
నల్లగొండ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఫొటోలో అచ్చంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాదిరిగా ఉన్న ఈయన పేరు బ్రహ్మయ్య. ఊరు నల్లగొండ. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదురుగా ఉన్న పుట్‌పాత్‌పై కుండలు, మట్టిపాత్రలు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. బ్రహ్మయ్యను చూసిన వారంతా మంత్రి కోమటిరెడ్డిలా ఉన్నావంటూ ఆయనతో చెబుతున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. వీడియోలు చేసి.. ‘కోమటిరెడ్డికి డూప్’ అంటూ ఇన్‌స్టాలో పెడుతున్నారు. ఇదే విషయాన్ని బ్రహ్మయ్యను అడిగితే.. మూడేళ్లుగా తనను చాలామంది మంత్రి కోమటిరెడ్డిలా ఉన్నావని అంటున్నారని మురిసిపోతూ చెప్పాడు.