రామగుండం ఎమ్మెల్యేకు బీపీఎల్ లీగల్ నోటీసులు
ABN , Publish Date - May 07 , 2026 | 05:08 AM
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు రామగుండంలో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేసిన బ్రిటీష్..
తమ భూముల ఆక్రమణకు రైతులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ
గోదావరిఖని, మే 6 (ఆంధ్రజ్యోతి) : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు రామగుండంలో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేసిన బ్రిటీష్ ఫిజికల్ లాబరేటరీ్‌స(బీపీఎల్) కంపెనీ లీగల్ నోటీసు జారీ చేసింది. బీపీఎల్ కంపెనీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది రాజ్‌ఠాకూర్‌కు నోటీసు జారీ చేశారు. విద్యుత్ కేంద్రం నిర్మాణం జరుగనందున రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి అప్పగించాలంటూ రాజకీయ పక్షాలు, రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కొన్నేళ్లుగా వారి నుంచి సేకరించిన భూములను సాగు చేసుకుంటున్నారు. ఈ వివాదంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రోత్సాహంతోనే తమ భూముల్లోకి రైతులు, ఇతరులు చొరబడుతున్నారని ఆరోపిస్తూ బీపీఎల్ లీగల్ నోటీసు జారీ చేసింది.