అప్పుతెచ్చిన డబ్బులు కాలిపోయే
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:05 AM
యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామం లో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది.
బొమ్మలరామారం,జూలై19(ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామం లో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. గ్రామనికి చెందిన సంగి స్వామి పెంకుటింట్లో రాత్రి 9గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గమనించిన కుంటుంబసభ్యులు ఇంటి బయటకు వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అగాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేనేకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. అప్పటికే ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్ మొత్తం కాలిపోయాయి. కొత్త ఇంటికోసం అప్పుగా తెచ్చిన రూ.2.50లక్షల నగదు కాలిపోయింది. ప్రభుత్వం అదుకోవాలని బాధితుడు కోరాడు.