Share News

kumaram bheem asifabad-బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కీలకం

ABN , Publish Date - Jun 07 , 2026 | 10:10 PM

ఎన్నికల ప్రక్రియలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన బీఎల్‌ఏల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాల పరిశీలన, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై పూర్తిగా కలిగి ఉండాలన్నారు.

kumaram bheem asifabad-బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కీలకం
మాట్లాడుతున్న ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌

కాగజ్‌నగర్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన బీఎల్‌ఏల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాల పరిశీలన, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై పూర్తిగా కలిగి ఉండాలన్నారు. ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ విజయానికి బీఎల్‌ఏలే బలమైన సైన్యమని అన్నారు. ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కామ్డే అనిల్‌, లెండుగురే శ్యాంరావు, కౌన్సిలర్లు ఎమ్మాజీ శారద, కచ్చకయాల జ్యోతి, దుర్గం సూరజ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అల్లాడి రాజు, వివిధ మండలాల అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 10:10 PM