మోదీ పాలనపై రచించిన గ్రంథాలు వెంకయ్యకు బహూకరణ
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:39 AM
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు 78వ జన్మదినం సందర్భంగా ఆయనకు మోదీ పాలనపై రచించిన అధ్యయన గ్రంథాలను రాష్ట్ర బీసీ కమిషన్ ...
హైదరాబాద్, జూలై 1(ఆంధ్రజ్యోతి): మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు 78వ జన్మదినం సందర్భంగా ఆయనకు మోదీ పాలనపై రచించిన అధ్యయన గ్రంథాలను రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రచయిత వకుళాభరణం కృష్ణమోహన్‌రావు బహూకరించారు. జూబ్లీహిల్స్‌లోని వెంకయ్య నాయుడు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘‘శ్రీ నరేంద్ర మోదీ-భారత్‌ను విశ్వ వేదికపై నిలిపిన మహానాయకుడు’’, ‘‘అంత్యోదయం నుంచి వికసిత భారత్’’ అనే రెండు పరిశోధనాత్మక అధ్యయన గ్రంథాలను అందజేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ గ్రంథాలను ఆవిష్కరించినట్లు వకుళాభరణం తెలిపారు. గ్రంథాలను పరిశీలించిన వెంకయ్య వాటిలోని లోతైన విశ్లేషణ, సమగ్ర సమాచారాన్ని అభినందించారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు అట్లూరి రామకృష్ణ పాల్గొన్నారు.