kumaram bheem asifabad-బోనస్ 7 రకాలకే..
ABN , Publish Date - Jun 25 , 2026 | 10:33 PM
సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు బోనస్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వానాకా లం నుంచి ఏడు రకాల సన్నాలకు మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ, రైతులకు అవగాహన కల్పిం చేందుకు ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నది. గతంలో 33రకాల సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించగా, ప్రస్తుతం ఏడు రకాలకే పరిమితం చేసింది. సన్నరకం వరి సాగును ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్‌ను అందిస్తోంది.
- అయోమయంలో అన్నదాతలు
- రైతులకే ప్రయోజనమని చెబుతున్న అధికారులు
చింతలమానేపల్లి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు బోనస్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వానాకా లం నుంచి ఏడు రకాల సన్నాలకు మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ, రైతులకు అవగాహన కల్పిం చేందుకు ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నది. గతంలో 33రకాల సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించగా, ప్రస్తుతం ఏడు రకాలకే పరిమితం చేసింది. సన్నరకం వరి సాగును ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్‌ను అందిస్తోంది. దీంతో సన్న వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. కానీ ఈ ఏడు వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం చెప్పిన ఏడు రకాల వరి సన్నాలను సాగు చేయాలని కొత్త నిబంధనలు విధించింది. దీంతో అన్నదాతలు అయోమయానికి గురువుతున్నారు. జిల్లాలో వరి సాగు అంతంత మాత్రంగా కన్పిస్తుంది. ప్రభుత్వ నిబంధనలతో సాగు విస్తీర్ణం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. దొడ్డు రకం వరి పంట సాగు నుండి ఇప్పుడిప్పుడే రైతులు సన్నరకం సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రకాలను సాగు చేస్తే రూ. 2,461 మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ.500 లను బోనస్‌గా అందిం చనున్నారు. ఈ ఏడు రకాలను సాగు చేసేలా అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
- ప్రభుత్వం ప్రకటించిన..
ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్నాలను సాగు చేస్తే దిగుబడులు వస్తాయో..లేదోనన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తం అవుతున్నాయి. అలాగే జిల్లా వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు తట్టుకొని ఆశించిన దిగుబడులు రాకపోతే పరిస్థితి ఏంటని రైతులు తర్జన..భర్జన పడుతున్నారు. అసలే సన్నరకం ధాన్యం అంతంత మాత్రంగా దిగుబడులు వస్తాయి. కొత్త రకాలను సాగు చేస్తే ఎలా ఉంటుందోనని రైతులు అభిప్రాయపడుతున్నా రు. ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే పెట్టిన పెట్టుబడులు చేతికి వస్తాయని చెబుతున్నారు. సాగు అనుభవం ఉన్న రైతులు తెలిసిన సన్నరకం విత్తనాలను సాగు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సన్నలతో ఇబ్బందులు ఉంటాయని రైతులు ఆందోళన చెందు తున్నారు. జిల్లాలో 4,52,202 ఎకరాల్లో వివిధ పంటలుసాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా ఇందులో అగ్రభాగం పత్తి పంట సుమారుగా 3,70,919 ఎకరాలు, తర్వాత స్థానం వరి పంట సుమారుగా 60 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉన్నది.
ప్రభుత్వం చెప్పిన ఏడు రకాలు..
ఫ బీపీటీ - 5204 (సాంబమసూరి)
ఫ ఆర్‌ఎన్‌ఆర్ - 15048
ఫ హెచ్‌ఎంటీ సోనా.
ఫ జైశ్రీరాం
ఫ కేఎన్‌ఎం 1638 (కునారం సన్నలు)
ఫ డబ్లు ఐ ఎల్ - 44 (సిద్ది)
ఫ కేఎన్‌ఎం - 7715 (కొత్తరకం)
ఏడు రకాలకు భారీ డిమాండ్..
ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నరకం విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రభుత్వ ప్రకటతో సన్నరకం విత్తనాల కోసం రైతులు అన్వేషణ మొదలు పెట్టారు. రైతులకు అవసరమైన విత్తనాలను మార్కెట్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిన సరిపడా విత్తనాలు దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ధరలను పెంచి అమ్మేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మార్కెట్లో 25 కేజీల సన్న రకం విత్తన సంచి ధర రూ. 1,050 వరకు ఉంటుంది. కానీ డిమాండ్‌ను ఇదే సంచికి బట్టి ధర రూ. 1,200 నుండి 1400 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇదేంటని అడిగితే స్టాక్‌లేదని తిప్పిపంపుతున్నారని ఆరోపిస్తున్నారు. వర్షాలు మరింత కురిస్తే భారీగా డిమాండ్ పెరుగుతుందన్న ఉద్యేశ్యంతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి నిలువ చేసుకుం టున్నారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా లేక పోవడంతో విత్తన కొనుగోళ్లు కూడా అంతంత మాత్రంగానే కన్పిస్తుంది. కానీ అన్ని రకాల వడ్లకు ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి..
- జయరాం బొట్టుపల్లి, రైతు సంఘం నాయకుడు
అన్ని రకాల వడ్లకు ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి. కేవలం ఏడు రకాల వడ్లకు మాత్రమే బోనస్ ఇ్తామని ఏడు రకాల వడ్లకు సంబంధించిన వివ రాలు మాత్రమే ప్రకటించడం తగదు. రైతులు దిగు బడులు రాకపోతే తీర:ంగా నష్టపోతారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.