kumaram bheem asifabad- జలవిద్యుత్ కేంద్రంపై నీలినీడలు
ABN , Publish Date - May 22 , 2026 | 10:05 PM
బెజ్జూరు మం డలంలోని తలాయి గ్రామ సమీపంలో జలవిద్యుత్ కేంద్రం నిర్మించాలన్న ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు. ప్రాణహిత నదిపై జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిజాం హయాంలోనే సర్వేలు జరిపి పనులు ప్రారంభించారు. అప్పట్లో పిల్లర్లు నిర్మించినా పనులు ముందుకు సాగలేదు. నిజాం ప్రభుత్వం పతనంతో పనులు నిలిచి పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జలవిద్యుత్ కేంద్రం పనులు మొదలవుతాయని భావించిన ఈ ప్రాంత ప్రజల ఆశలు ఆవిరయ్యాయి.
- ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చని వైనం
- కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలని వినతి
బెజ్జూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మం డలంలోని తలాయి గ్రామ సమీపంలో జలవిద్యుత్ కేంద్రం నిర్మించాలన్న ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు. ప్రాణహిత నదిపై జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిజాం హయాంలోనే సర్వేలు జరిపి పనులు ప్రారంభించారు. అప్పట్లో పిల్లర్లు నిర్మించినా పనులు ముందుకు సాగలేదు. నిజాం ప్రభుత్వం పతనంతో పనులు నిలిచి పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జలవిద్యుత్ కేంద్రం పనులు మొదలవుతాయని భావించిన ఈ ప్రాంత ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. ఉమ్మడి ప్రభుత్వ హయాంలో తలాయి జలవిద్యుత్ కేంద్రంపై పాలకులెవ్వరూ స్పందించక పోవడంతో ప్రాజెక్టు నిర్మాణం మరుగున పడ్డది. గత బీఆర్‌ఎస్ ప్రభు ్వం కూడా ఆ దిశగా దృష్టి సారించకపోవడంతో జలవిద్యుత్ కేంద్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున గల బెజ్జూరు మండలం తలాయి గ్రామ సమీపంలో ప్రాణహిత నదిపై జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిజాం ప్రభుత్వం హయాంలో చిగురించగా అది ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఆ ప్రతిపాదన మరుగున పడింది. తెలంగాణ రాష్ట్రంగా అవతరిస్తే జలవిద్యుత్ కేంద్రం పనులు మొదలవుతాయని భావించిన ప్రజల ఆశలు గల్లంతయ్యాయి.
- ప్రాణహిత నదిపై
తలాయి గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగా ణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రాణహిత నదిపై ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న దేవలమర్రి, తెలంగాణలోని తలాయి గ్రామాల మధ్య జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిజాం ప్రభుత్వం సర్వేలు చేపట్టింది. అప్పట్లో ఈ రెండు గ్రామాలు ఒకే ప్రభుత్వ పరిధిలో ఉండేవి. ఈలోగా నిజాం ప్రభుత్వం పతనం కావడంతో తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ప్రభుత్వం రెండో ధఫా సర్వేలు చేసింది. ప్రభుత్వాలు మారినా 1952నుంచి 1954వరకు దాదాపు పద్దెనిమిది నెలల పాటు సర్వే చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. 1955లో ఇక్కడికి కొన్ని యంత్రాలు ఇతర పరికరాలను సైతం తీసుకవచ్చా రు. అదే ఏడాది అక్కడ పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారుల ప్రైవేటు గుమాస్తా భార్య ప్రమాదవ శాత్తు తెల్ల ఇసుక మడుగులో పడి మృతి చెంద డంతో కొంత కాలం పాటు పనులు నిలిచి పోయా యి. 1956 సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భావం జరగడంతో ఈ సర్వే ముందుకు జరగలేదు. ఈలోగా భాషాప్రాదిపదికన రాష్ర్టాలు ఏర్పడటంతో ప్రాణహిత నది రెండు రాష్ర్టాలకు సరిహద్దుగా మారింది. హైదరాబాద్ రాష్ట్రంలో కలిసి ఉన్న చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాలు మహారాష్ట్రలో కలిసి పోయాయి. దేవలమర్రి గ్రామం సైతం మహారాష్ట్రలో కలిసింది. దీంతో ఈ ప్రాజెక్టు రెండు రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది. 1956లో ఇక్కడికి తీసుకవచ్చిన యంత్ర సామాగ్రి సైతం వెనక్కి తీసుక వెళ్లారు.
- అప్పట్లో వేసిన పిల్లర్లు..
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ని జాం ప్రభుత్వం మొదటగా తలాయి వద్ద జలవి ద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు ప్రారంభిం చిం ది. తలాయి వద్ద ప్రాణహిత నదిలో పుష్కలంగా నీరు ఉండడంతో వృథాగా పోతున్న జలవనరులను సద్వినియోగం చేసుకోవాలన్న సదుద్దేశ్యంతో నిజాం ఇక్కడ జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. నిజాం హయాంలో ప్రాణహిత నదిలో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి చేపట్టిన పిల్లర్లు నేటికి దర్శనమిస్తున్నాయి. అనంతరం నిజాం ప్రభుత్వం పతనం తర్వాత కొద్ది రోజులు సర్వేలు జరిపినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాగా తలాయి వద్ద జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కనుమరుగై పోతున్న నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత అప్పటి ఉమ్మడి ప్రభుత్వ హయాంలో 2007లో ఏపీ జెన్కో అధికారులు తలాయి వద్ద ప్రాణహిత నదిని సందర్శించారు. ఇక్కడ జలవి ద్యుత్ కేంద్రం 100మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్పుత్తి జరుగుతుందని అంచనా వేసిన జెన్కో అధికారులు తమకు కేవలం 25 మెగావాట్ల సామర్థ్యం వరకే తమ చేతుల్లో ఉందని వెనుతిరి గారు. దీంతో దశాబ్దాల కాలంగా ఈ ప్రాజెక్టు విషయంలో ఎవ్వరూ కూడా చొరవ చూపడం లే దు. 2009లో ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రి తన్నీరు హరీశ్‌రావు సైతం తలాయిని సందర్శించారు. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ దాని ఊసే లేకుండా పోయింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి విద్యుత్ సరిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తు తం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తు న్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో విద్యుత్ సదు పాయం కలగడంతో పాటు ఇక్కడి వారికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.