ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించం
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:04 AM
కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిపై కొంద రు స్థాయి మరిచి విమ ర్శలు చేస్తున్నారని, స హించే ప్రసక్తేలేదని మా జీ సర్పంచ్ బృంగి ఆ నంద్‌కుమార్, మునిసి పల్ వైస్ చైర్మన్ షాన వాజ్‌ఖాన్‌లు హెచ్చరించా రు.
- మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, మునిసిపల్ వైస్ చైర్మన్ షానవాజ్‌ఖాన్
కల్వకుర్తి సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిపై కొంద రు స్థాయి మరిచి విమ ర్శలు చేస్తున్నారని, స హించే ప్రసక్తేలేదని మా జీ సర్పంచ్ బృంగి ఆ నంద్‌కుమార్, మునిసి పల్ వైస్ చైర్మన్ షాన వాజ్‌ఖాన్‌లు హెచ్చరించా రు. నియోజకవర్గ అభివృ ద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే పని చేస్తుంటే కౌన్సిలర్‌గా కూడా గెలవలేని మాజీ మునిసిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కల్వకుర్తిలో ఆది వారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్లకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులచే గృహప్రవేశా లు చేయించలేదని అన్నారు. వివిధ పార్టీల్లో కొనసాగిన ఎడ్మ సత్యంకు కాంగ్రెస్ కార్యకర్తల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమ ర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ డైరెక్టర్ పసుల రమాకాంత్‌రెడ్డి, కౌన్సిలర్లు ఎజాస్, రాజేశ్‌కుమార్, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, చిత్తారి శ్రీనివాసులు, హను మానాయక్, రాజశేఖర్, హేయఖాన్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.