Share News

బీఎల్‌వోలు చురుకుగా పాల్గొనాలి

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:01 AM

అచ్చంపేట డివి జనల్‌ సబ్‌ కలెక్టర్‌ సలో ని చాబ్ర నియోజక వ ర్గంలోని వివిధ మండ లాల్లో పర్యటించారు.

బీఎల్‌వోలు చురుకుగా పాల్గొనాలి
బల్మూరులో ఓటరు పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అచ్చంపేట డివిజనల్‌ సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్ర

- అచ్చంపేట డివిజనల్‌ సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్ర

అమ్రాబాద్‌/ మన్న నూరు/ బల్మూరు, సె ప్టెంబరు 6 (ఆంధ్రజ్యో తి) : అచ్చంపేట డివి జనల్‌ సబ్‌ కలెక్టర్‌ సలో ని చాబ్ర నియోజక వ ర్గంలోని వివిధ మండ లాల్లో పర్యటించారు. అ మ్రాబాద్‌, మన్ననూరు, బల్మూరు, లింగాల మం డలాల్లో ఆమె పర్యటించి, బీఎల్‌వోలు చేపడుతున్న ఓటరు నమోదు ప్రక్రి యను పరిశీలించారు. అమ్రాబాద్‌లో మండ లంలోని మన్ననూర్‌, అమ్రాబాద్‌ పోలింగ్‌ కేం ద్రాలను పరిశీలించి బీఎల్‌వోలతో మాట్లాడారు. ప్రత్యేక ఓటరునమోదు జాబితా సవరణ ప్రక్రి యలో బీఎల్‌వోలు చురుకుగా పాల్గొని పూర్తి చేయాలని అచ్చంపేట సబ్‌కలెక్టర్‌ సలోని చాబ్ర అన్నారు. ఫారం-6, 7, 8లతో పాటు బీఎల్‌వో లకు గుర్తింపు కార్డులు సంబంధిత రికార్డులను సబ్‌ కలెక్టర్‌ పరిశీలించారు. అమ్రాబాద్‌ డిప్యూ టీ తహసీల్దార్‌ ఎన్‌.రాములునాయక్‌, బీఎల్‌వో సూపర్‌వైజర్‌, బీఎల్‌వోలు,సిబ్బంది పాల్గొన్నారు.

ఫ బల్మూరులోని రెండు పోలింగ్‌ కేంద్రాల ను అచ్చంపేట డివిజనల్‌ సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్ర పరిశీలించారు. ప్రతీ గ్రామంలో పోలింగ్‌ బూత్‌ల్లో పని చేస్తున్న బీఎల్‌వోలు ఓటరు ఫారాలను పరిశీలించి వివరణ తీసుకోవాలని అ న్నారు. నోటీసులు తీసుకున్నవారికి వెంటనే పూ ర్తి స్థాయిలో వివరణ తీసుకుని ఎక్కడా తప్పు దొర్లకుండా చూసుకోవాలని సూచించారు. కార్య క్రమంలో తహసీల్దార్‌ శ్రీకాంత్‌, బల్మూరు, అ నంతవరం బీఎల్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 12:01 AM