Share News

బీఎల్‌ఏలు పకడ్బందీగా పర్యవేక్షించాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:11 PM

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్య క్రమం (ఎన్‌ఐఆర్‌)లో ఎన్యు మరేషన్‌ ఫారాలను ప్రతీ ఒక ఓటరు నింపేలా బీఎల్‌ఏలు పర్యవేక్షించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.

బీఎల్‌ఏలు పకడ్బందీగా పర్యవేక్షించాలి
బీఆర్‌ఎస్‌ బూత్‌ స్థాయి ఏజెంట్ల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మర్రి

- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- ఎన్యుమరేషన్‌ ఫారాలను డిజిటలైజ్‌ చేయించాలని సూచన

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూ లై 9 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్య క్రమం (ఎన్‌ఐఆర్‌)లో ఎన్యు మరేషన్‌ ఫారాలను ప్రతీ ఒక ఓటరు నింపేలా బీఎల్‌ఏలు పర్యవేక్షించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఓటర్ల ద్వారా సేకరించిన ఎన్యుమరేషన్‌ ఫారాలను బీఎల్‌ఓల ద్వారా డిజిటల్‌ చేయించాలని సూచించారు. నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ కార్యాల యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ టౌన్‌, రూరల్‌ ప్రాంతాలకు చెం దిన బీఆర్‌ఎస్‌ బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అం శాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించా రు. బీఎల్‌ఓలకు సమయం కేటాయించి వారితో సమన్వయం చేసుకుని ఎస్‌ఐఆర్‌ పనులకు వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీశైలం, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బాబురావు, బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఫ తిమ్మాజిపేట, (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితాలో సమగ్ర సవ రణపై బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు అప్రమత్తం గా ఉండాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి సూచించారు. మండల పరిధిలోని నేరెళ్లప ల్లి 38వ పోలింగ్‌ బూత్‌లో గురువారం తన ఎన్యుమరేషన్‌ ఫారాన్నిమర్రి జనార్దన్‌రెడ్డి పూర్తి చేసి సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారి పద్మకు అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీ బూత్‌లెవల్‌ ఏజెంట్లతో సమా వేశం నిర్వహించి మాట్లాడారు. నాయకు లు జోగు ప్రదీప్‌, రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌ యాద వ్‌, వేణుగోపాల్‌గౌడ్‌ ఉన్నారు.

ఫ తాడూరు, (ఆంధ్రజ్యోతి) : మండలంలో ని బూత్‌ లెవల్‌ ఏజెంట్లతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమావేశమయ్యారు. తప్పు లు దొర్లకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశిం చారు. మండలంలోని 44 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 30,514ఓట్లు ఉన్నాయని, వీటిని జాగ్ర త్తగా పరిశీలించి మార్పులు, చేర్పులు జరిపిం చాలన్నారు. కార్యక్రమంలలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకులు తిరుపతిరెడ్డి, రాజుగౌడ్‌, అనిల్‌రెడ్డి, పర్వతాలు, రాములు, వివిధ గ్రా మాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 11:11 PM