Share News

కాంగ్రెస్‌ పార్టీ విజయానికి బీఎల్‌ఏలు కీలకం

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:20 PM

కాంగ్రెస్‌ పార్టీ ని గ్రామస్థాయి నుంచి మరిం త బలోపేతం చేయడంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, సూప ర్‌వైజర్లు అత్యంత కీలక పాత్ర పోషించాలని కల్వకుర్తి ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అ న్నారు.

కాంగ్రెస్‌ పార్టీ విజయానికి బీఎల్‌ఏలు కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీ ని గ్రామస్థాయి నుంచి మరిం త బలోపేతం చేయడంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, సూప ర్‌వైజర్లు అత్యంత కీలక పాత్ర పోషించాలని కల్వకుర్తి ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అ న్నారు. కల్వకుర్తి నియోజకవర్గ బీఎల్‌ఏలు, సూ పర్‌వైజర్లకు ఆమనగల్‌ పట్టణంలో నిర్వహిం చిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ బీఎల్‌ఏ తన పరిధిలోని ఓటర్ల వివరాలను ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ ప్రజలకు పార్టీ సిద్ధాంతాలు, ప్ర భుత్వ ప్రజాహిత కార్యక్రమాలను చేరవేయ డంలో చురుకుగా వ్యవహరించాలని సూచిం చారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో సమ న్వయం, అంకితభావంతో పనిచేయాలని ఎమ్మె ల్యే సూచించారు. ప్రతీ కార్యకర్త పార్టీకి రాయ బారిగా వ్యవహరించాలని ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ రాచ మల్ల సిద్దేశ్వర్‌, అసెంబ్లీ ఇన్‌చార్జి సంఽధ్యారెడ్డి, బీఎల్‌ఏ స్పెషల్‌ ఇన్‌చార్జి గౌడ్‌ సతీష్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బృంగి ఆనంద్‌కు మార్‌, ఎన్నం భూపతిరెడ్డి, నియోజక వర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు, బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:20 PM