కార్యకర్తల అంకితభావమే బీజేపీ బలం
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:33 AM
బీజేపీ కార్యకర్తల అంకిత భావమే పార్టీ బలం. కార్యకర్తల త్యాగాల వల్లనే బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించింది’’ అని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు...
తెలంగాణలో అధికారం ఖాయం: రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ కార్యకర్తల అంకిత భావమే పార్టీ బలం. కార్యకర్తల త్యాగాల వల్లనే బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించింది’’ అని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’ కార్యక్రమంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి పరిషత్, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను నిర్బంధించినా భయపడక ఉద్యమాలు చేశారని, ఆ త్యాగాల పునాది మీదనే ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని, అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించిందన్నారు. అదే త్యాగస్ఫూర్తి, అదే అంకితభావంతో పనిచేస్తే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో అనేక చోట్ల బీజేపీ రెండో స్థానంలో నిలిచిందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాలో ఆర్‌ఎ్‌సఎస్, ఏబీవీపీ కార్యకర్తలను కిడ్నాప్ చేయడం, హత్యలు చేయడం వంటి ఘటనలు జరిగేవి. అలాంటి కఠిన పరిస్థితుల్లోనూ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా పోరాడినందువల్లే ఆ ఏడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా ఎదిగింది’’ ఆయన అన్నారు.