కొల్లాపూర్‌లో బీజేపీవి డ్రామా దీక్షలు
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:41 PM
ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొల్లాపూర్ పర్యటన, పాలమూరు - రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజె క్టు సమీక్షపై బీజేపీ నాయకుడు ఎల్లేని సుధాకర్‌రావు చేస్తున్న విమర్శలు, డ్రామా దీక్షలపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు నిప్పులు చెరిగారు.
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు
కొల్లాపూర్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొల్లాపూర్ పర్యటన, పాలమూరు - రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజె క్టు సమీక్షపై బీజేపీ నాయకుడు ఎల్లేని సుధాకర్‌రావు చేస్తున్న విమర్శలు, డ్రామా దీక్షలపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు నిప్పులు చెరిగారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలో మంత్రి జూపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు - రంగారెడ్డి ప్రా జెక్టుపై సమీక్షకు వస్తే బీజేపీ నాయకులకు క డుపుమంట ఎందుకు అని బాలరాజు పేర్కొన్నా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొల్లాపూర్‌కు వ చ్చింది రాజకీయాలు చేయడానికి కాదని, పాల మూరు - రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని 12లక్షల ఎకరాలకు సాగునీరు అం దించి రైతుల పొలాలను సస్యశ్యామలం చేయ డానికేనని ఆయన స్పష్టం చేశారు. స్థానిక మం త్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఈ ప్రాజెక్టులోని 9 పం పులను త్వరితగతిన పునరుద్ధరించి ప్రజలకు నీరందించే భగీరథ ప్రయత్నం చేస్తుంటే.. ప్రతి పక్షాలకు కడుపుమంటగా మారిందని మండిప డ్డారు. మొన్నటికి మొన్న కొల్లాపూర్ మండలం సోమశిలలో హెలి టూరిజం కోసం హెలికాప్టర్ దిగడానికి, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఒక ఎకరం భూమి అడిగితే నీ బినామీ పేరిట ఉన్న భూమిని ఇవ్వడానికి చేతకాని నువ్వా కొల్లాపూ ర్ అభివృద్ధి గురించి మాట్లాడేది అని ఎల్లేనిని వారు నిలదీశారు. మునిసిపల్ కౌన్సిలర్లు బోరెల్లి మహేష్, ఎండీ అన్వర్, పెబ్బేటి శేఖర్, మానవ పాడు నరసింహ మాట్లాడుతూ సుధాకర్‌రావు కు నిజంగా రైతులపై, కొల్లాపూర్ ప్రాంతంపై చిత్తశుద్ధి ఉంటే, పాలమూరు - రంగారెడ్డి ప్రాజె క్టుకు జాతీయ హోదా తేవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, సుధాకర్‌రావు ఇద్దరూ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు లాంటి వాళ్లని అన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ కౌన్సిల ర్లు బోరెట్టి మహేష్, ఎండి అన్వర్, పెబ్బేటి శేఖర్, మానవపాడు నరసింహ, సీనియర్ నా యకులు రెడ్డి సత్యం, రామకృష్ణ, రామ్మోహన్, కలర్ మహేష్, మధుసూదన్‌రావు, మల్లేష్, రాము తదితరులు పాల్గొన్నారు.