Share News

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:08 AM

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీల హక్కులను వినియోగిస్తున్న పరిస్థితిపై సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సుప్రీం తీర్పుతో ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడులను ప్రోత్సహించే కార్యకలాపాలకు చెక్‌ పడింది. ఇందువల్ల నిజమైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది’’ అని రాంచందర్‌రావు అభిప్రాయపడ్డారు.

Updated Date - Mar 25 , 2026 | 04:13 AM