రేపు అసెంబ్లీ ముట్టడి: బీజేపీ
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:53 AM
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సోమవారం అసెంబ్లీ ముట్టడి నిర్వహించనున్నట్లు బీజేపీ వెల్లడించింది.
హైదరాబాద్, మార్చి21(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సోమవారం అసెంబ్లీ ముట్టడి నిర్వహించనున్నట్లు బీజేపీ వెల్లడించింది. ఇందులో నిరుద్యోగులు, రైతులు, పేదలు పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్‌గౌడ్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు. ప్రజాహక్కుల సాధన కోసం దీనిని చేపట్టినట్లు పేర్కొన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు సైతం నిధులివ్వడం లేదన్నారు.