రాష్ట్రంలో బీజేపీ సర్కారు.. ఈ బహిరంగ సభే సంకేతం
ABN , Publish Date - May 11 , 2026 | 05:47 AM
ప్రధాని మోదీ రాక సందర్భంగా పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభే రానున్నకాలంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంకేతం...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ రాక సందర్భంగా పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభే రానున్నకాలంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంకేతం అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడురాంచందర్‌రావు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడిగా మోదీ పేరొందని తెలిపారు. రాష్ట్రంలో జాతి వ్యతిరేకమైన శక్తులతో.. దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిగా విభజించే పార్టీలతో.. కుటుంబ పాలనలో ఉన్న వారితో బీజేపీ పోరాటం చేస్తోందని అన్నారు. తెలంగాణతో మోదీకి అనుబంధం ఉందన్నారు. నిజాం హయాంలోని హైదరాబాద్ రాష్ట్రం దేశంలో విలీనమైన సెప్టెంబరు 17 తెలంగాణకు ఎంతో ప్రత్యేకం అని, సెప్టెంబరు 17వ తేదీ మోదీ పుట్టినరోజు కూడా అని చెప్పారు.