విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్ ప్రభావం
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:06 AM
రాష్ట్ర ప్రభుత్వ విద్యా కమిషన్‌లో మావోయిస్టు భావజాలమున్న వారు, అర్బన్ నక్సల్స్ అధికంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ విద్యా కమిషన్‌లో మావోయిస్టు భావజాలమున్న వారు, అర్బన్ నక్సల్స్ అధికంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. తెలంగాణ విద్యా విధానం-2026 అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో ‘ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్’ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. నూతన విద్యా విధానం రూపకల్పనలో మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు భారతీయ సంస్కృతి, విలువలను ప్రతిబింబించేలా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్లు టి.పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.