చిరంజీవితో రాంచందర్‌రావు భేటీ
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:32 AM
విశేష్ జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో...
హైదరాబాద్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): విశేష్ జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మోదీ ప్రభుత్వం, గత 12 సంవత్సరాలలో సాధించిన విజయాలు, మైలురాళ్లకు సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. అభివృద్థి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం పట్ల మోదీ ప్రభుత్వ నిబద్థతను రాంచందర్‌రావు వివరించారు. సమాజం, సంస్కృతి, సినీ రంగం, జాతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.