ఓటు చోరీ కాదు.. రాహుల్ మెదడు చోరీ
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:24 AM
ఓటు చోరీ కాదు.. రాహుల్ గాంధీ మెదడు చోరీ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు.
వీబీ-జీ-రామ్-జీ ఒక చరిత్రాత్మక సంస్కరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఓటు చోరీ కాదు.. రాహుల్ గాంధీ మెదడు చోరీ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. పదే పదే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల మేలు కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన ఓటు హక్కు భారత పౌరులకు మాత్రమే ఉండాలని, కానీ.. కొన్ని ప్రాంతాల్లో విదేశాల నుంచి అక్రమంగా చొరబడ్డ వారినీ ఓటర్ల జాబితాల్లో చేర్చుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ-జీ-రామ్-జీ చట్టం... గ్రామ స్వరాజ్యానికి బలాన్ని సమకూర్చే చరిత్రాత్మక సంస్కరణగా పేర్కొన్నారు.