Share News

కాళేశ్వరంపై రాజకీయ డ్రామాలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:08 AM

ళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు రాజకీయ డ్రామాలాడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం...

కాళేశ్వరంపై రాజకీయ డ్రామాలు

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌‌పై రాంచందర్‌రావు మండిపాటు

హైదరాబాద్‌, జులై 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు రాజకీయ డ్రామాలాడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని, ఇందులో జరిగిన అవినీతిని సీఎం రేవంత్‌ మరచిపోయారని విమర్శించారు. ఈ ప్రాజెక్టులోని లోపాలపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని ఎన్‌డీఎ్‌సఏ స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడం దారుణం’ అని విమర్శించారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతున్న ప్రభుత్వం.. ఎంఐఎంకు చెందిన అక్రమ కట్టడాలను పట్టించుకోవడం లేదేమని ప్రశ్నించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మూర్ఖంగా వ్యవహరించకుండా తక్షణం మరమ్మతులు చేపట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. భేషజాలకు వెళ్లకుండా రైతుల కోసం, హైదరాబాద్‌ నగరవాసుల తాగునీటి అవసరాల దృష్ట్యా కన్నెపల్లి నుంచి గోదావరి జలాలలను పంపింగ్‌ చేయాలని కోరారు.

Updated Date - Jul 07 , 2026 | 04:08 AM