Share News

రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలి

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:08 AM

రాష్ట్ర రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు

  • మహిళా బిల్లుకు మద్దతుగా భారీ స్కూటీ ర్యాలీ

హిమాయత్‌నగర్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్‌ అధినియం(మహిళా రిజర్వేషన్‌ బిల్లు)కు మద్దతుగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షురాలు డాక్టర్‌ శిల్పారెడ్డి నేతృత్వంలో నారాయణగూడ కేఎంఐటీ కాలేజీ నుంచి అసెంబ్లీ వరకు భారీ స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా మహిళలకు గౌరవప్రదమైన స్థానం లభిస్తుందన్నారు. ర్యాలీలో హిమాయత్‌నగర్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షురాలు జి.మాధవి, మహిళా మోర్చా కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 04:08 AM