కేంద్ర నిధులు పంచాయతీలకు అందట్లేదు
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:59 AM
పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీల కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ముందు నుంచే బీజేపీ చెబుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీల కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ముందు నుంచే బీజేపీ చెబుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు విడుదల చేసిన నిధులను దారి మళ్లించకుండా వెంటనే గ్రామపంచాయతీలకు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ సోమవారం చలో అసెంబ్లీ నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసిన సుమారు రూ. 640 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు చేరకుండా దారి మళ్లిస్తోందని తెలిపారు. కేంద్రం విడుదల చేసిన నిధులను దారి మళ్లించకుండా వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలని సీఎంను కోరారు.