Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయండి

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:48 AM

భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ ఆర్‌ఎ్‌స)లో భాగంగా లక్షల మంది ప్రజలు ఫీజులు చెల్లించినా ప్రభుత్వం ఇప్పటివరకు క్రమబద్ధీకరణ చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఆరోపించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయండి

  • ప్రజలు చెల్లించిన ఫీజులు వెనక్కివ్వండి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌

  • అన్ని మునిసిపాలిటీల్లో బీజేపీ పోటీ చేస్తోందని వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 31(ఆంధ్ర జ్యోతి): భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ ఆర్‌ఎ్‌స)లో భాగంగా లక్షల మంది ప్రజలు ఫీజులు చెల్లించినా ప్రభుత్వం ఇప్పటివరకు క్రమబద్ధీకరణ చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఆరోపించారు. వెంటనే ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని రద్దుచేసి, ఫీజులను వెనక్కి ఇచ్చేయాలని.. భూముల క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పురపాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎ్‌సకు సుమారు 25.67 లక్షల దరఖాస్తులు వస్తే, ప్రభుత్వానికి రూ.250 కోట్ల ఆదాయం వచ్చిందని, న్యాయపరమైన సమస్యలతో ఎల్‌ఆర్‌ఎస్‌ సక్రమంగా అమలు కాక లక్షలాది మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇప్పటి కీ20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 3.6 లక్షల దరఖాస్తులు వస్తే.. 8,000 దరఖాస్తులకే ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 15 రోజుల్లో భూముల క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అన్నిచోట్లా పోటీ చేస్తోందని చెప్పారు. 2,996 వార్డుల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలిపామని వెల్లడించారు. రాష్ట్రంలో తుపాకీ కాల్పులు, రేప్‌లు, డ్రగ్స్‌, దొంగతనాలు నిత్యకృత్యమయ్యానని మండిపడ్డారు.

Updated Date - Feb 01 , 2026 | 06:49 AM