Share News

ఎన్నికల్లో గెలవాలని బీజేపీ తప్పుదారి: పొన్నం

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:47 AM

సర్‌ ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్న ఓటర్లను సైతం తొలగిస్తున్నారని, ఓట్ల దొంగతనం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.

ఎన్నికల్లో గెలవాలని బీజేపీ తప్పుదారి: పొన్నం
ponnam prabhakar

ఎన్నికల్లో గెలవాలని బీజేపీ తప్పుదారి: పొన్నం

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు15(ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్న ఓటర్లను సైతం తొలగిస్తున్నారని, ఓట్ల దొంగతనం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో.. నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత నర్సింహారెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని, తెలంగాణలోనూ లక్షల సంఖ్యలో ఓట్ల దొంగతనం జరిగిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోందని మండిపడ్డారు. సర్‌ రాకముందు కూడా కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందని అమిత్‌షా అంటున్నారని, తమ పార్టీ ఎప్పుడూ గెలుపు ఓటములకు భయపడలేదన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 06:03 AM