కాంగ్రెస్ ఆందోళనపై బీజేపీ నిరసన
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:31 AM
ఢిల్లీలో రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతల వైఖరిని నిరసిస్తూ సుల్తానాబా ద్‌లో బీజేపీ నాయకులు రాజీవ్ రహదారిపై ఆందోళన చేశారు. గురువారం వారు ర్యాలీగా వచ్చి రాజీవ్ రహదారిపై బైఠాయించారు. కార్యక్ర మంలో
సుల్తానాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతల వైఖరిని నిరసిస్తూ సుల్తానాబా ద్‌లో బీజేపీ నాయకులు రాజీవ్ రహదారిపై ఆందోళన చేశారు. గురువారం వారు ర్యాలీగా వచ్చి రాజీవ్ రహదారిపై బైఠాయించారు. కార్యక్ర మంలో సుల్తానాబాద్, ఎలిగేడు మండల శాఖ ల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, గాదె రంజిత్ రెడ్డి,సౌదరి మహేందర్, మన్‌కీ బాత్ జిల్లా కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కొమ్ము తిరుపతి, రాజేంద్ర ప్రసాద్, ఏగోలపు సదయ్య, తదితరులు పాల్గొన్నారు
కళ్యాణ్‌నగర్ : ప్రధాని నరేంద్ర మోదీ నివాస ముట్టడికి ప్రయత్నించిన రాహుల్‌గాంధీ తీరును నిరసిస్తూ గురు వారం రామగుండం బీజేపీ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గోదావరిఖని చౌరస్తాలో ఆందోళనకు దిగగా పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకు న్నారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం ముట్టడికి ప్రయత్నం చేసిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొంత మంది బీజేపీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయం ఎదుట రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు సుల్వ లక్ష్మీనర్సయ్య, చిలుక భారతి, గుండబోయిన భూమయ్య, అపర్ణ, బాలు, సరిత, శ్యామ్, భరత్, మహేందర్, వేణు, మహేష్, పద్మ, ప్రవీణ్ పాల్గొన్నారు.