ఏసీ గదుల నుంచి బయటకు రండి
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:35 AM
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు ఆరోపించారు.
సీఎంకు బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు బహిరంగ లేఖ
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి విద్యా కమిషన్ ద్వారా వారి వేతనాలు తగ్గించేలా నివేదిక తెప్పించడం వారిని ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి ఈ రంగాల వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సీఎంకు విజ్ణప్తి చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి రాంచందర్‌రావు బహిరంగలేఖ రాశారు. రైతుభరోసా కింద రూ. 15వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ మొత్తాన్ని రూ. 12వేలకే పరిమితం చేశారని, అది కూడా సమయానికి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందక, పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.