Share News

మా కార్యకర్తలను అరెస్టు చేస్తారా?

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:28 AM

హిందువులను దుర్భాషలాడినందుకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, నిరసన వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తారా అని కాంగ్రెస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మండిపడ్డారు.

మా కార్యకర్తలను అరెస్టు చేస్తారా?

  • కాంగ్రెస్‌పై బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపాటు

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): హిందువులను దుర్భాషలాడినందుకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, నిరసన వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తారా అని కాంగ్రెస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మండిపడ్డారు. ఎమ్మెల్యే సామేల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం రేవంత్‌ను డిమాండ్‌ చేశారు. దళితుల హక్కులను ఎమ్మెల్యే సామేల్‌ కాలరాస్తున్నారని మాజీ ఎంపీ వెంకటేశ్‌ నేత ఆరోపించారు. దళితుడిగా చెలామణి అవుతూ రిజర్వేషన్‌ కేటగిరీలో ఎమ్మెల్యేగా గెలిచిన సామేల్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధులు జె.సంగప్ప, సోలంకి శ్రీనివాస్‌ చెప్పారు. మరోవైపు ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రిని బీజేపీ ‘హజ్రత్‌’ రేవంత్‌రెడ్డిగా అభివర్ణించింది. రేవంత్‌ మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్‌ శుక్లా ఢిల్లీలో ఆరోపించారు.

Updated Date - Mar 17 , 2026 | 05:28 AM