Share News

పేదల ఇళ్లు కూలిస్తే సహించబోం: రాంచందర్‌

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:27 AM

మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్లు కూల్చివేస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. రాంచందర్‌రావు హెచ్చరించారు.

పేదల ఇళ్లు కూలిస్తే సహించబోం: రాంచందర్‌

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్లు కూల్చివేస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. రాంచందర్‌రావు హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్‌లోని సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును పాలకులు ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. ఒకప్పుడు కాలుష్యంతో నిండిన సబర్మతి నదిని నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నప్పుడు నర్మదా నదితో అనుసంధానం చేసి ప్రక్షాళన చేశారని గుర్తుచేశారు. అక్కడ ఉంటున్న 4వేలమంది పేదలకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు చేపట్టారని వివరించారు.

Updated Date - Mar 14 , 2026 | 05:27 AM