Share News

వెయ్యిమంది రేవంత్‌లు అడ్డుపడినా మహిళా బిల్లు ఆగదు

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:55 AM

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు వెయ్యిమంది రేవంత్‌లు అడ్డుపడినా ...

వెయ్యిమంది రేవంత్‌లు అడ్డుపడినా మహిళా బిల్లు ఆగదు

  • మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు వెయ్యిమంది రేవంత్‌లు అడ్డుపడినా ఆగదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఆపే శక్తి ఉందా.. ఒకసారి ఆలోచించాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. బుధవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన నారీ శక్తివందన్‌-నారీ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గల్లీలో కూర్చొని సీఎం రేవంత్‌రెడ్డి బిల్లును, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలు గుణపాఠం చెబుతారన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 03:55 AM