Share News

బీజేపీ ఎంపీ కంగనారనౌత్‌ను అరెస్టు చేయాలి

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:09 PM

ఢిల్లీలో నీట్‌ పేపర్‌లీకేజీపైన విద్యార్థులు, యువకుల ఆధ్వర్యంలో జరిగిన మహత్తర ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడిన బీజే పీ పార్లమెంట్‌ సభ్యురాలు కంగనా రనౌత్‌ ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ డిమాండ్‌ చేశారు.

బీజేపీ ఎంపీ కంగనారనౌత్‌ను అరెస్టు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎం.బాలనరసింహ

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. బాలనరసింహ

పెద్దకొత్తపల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ఢిల్లీలో నీట్‌ పేపర్‌లీకేజీపైన విద్యార్థులు, యువకుల ఆధ్వర్యంలో జరిగిన మహత్తర ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడిన బీజే పీ పార్లమెంట్‌ సభ్యురాలు కంగనా రనౌత్‌ ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ డిమాండ్‌ చేశారు. ఆమె పార్లమెంట్‌ సభ్య త్వాన్ని రద్దు చేయాలని కోరారు. గురువారం పెద్దకొత్తపల్లిలోని సీపీఐ కార్యాలయంలో కొల్లా పూర్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాముడు పేరుతో అధికా రంలోకి వచ్చి రాముని గుడి చందాలను దోచు కుంటున్న బీజేపీ వారు అని, వారికి చిత్తశుద్ది ఉంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయ న డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఆగస్టు 6 నుంచి 14వరకు కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ మాట్లాడు తూ పాదయాత్రలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యా లను ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాని విషయమై ప్రజల్లో ఎండగడతామని అ న్నారు. అంతకు ముందు సీపీఐ మండల కార్య దర్శి, దివంగత బొల్లెద్దుల శ్రీనివాసులు చిత్ర పటానికి పూల మాలలు వేసి మౌనం పాటిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు తుమ్మల శివుడు, బండి లక్ష్మీపతి, బిజ్జ శ్రీనివాసులు, కుర్మయ్య, తన్నీరు మల్లయ్య, మండల మాజీ కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 11:09 PM