Share News

‘దానం’పై స్పీకర్‌ తీర్పును కొట్టేయండి

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:56 AM

బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయి కాంగ్రెస్‌ టికెట్‌పై సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీచేసిన ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు దానం నాగేందర్‌ పదవిలో కొనసాగడానికి అనర్హుడని...

 ‘దానం’పై స్పీకర్‌ తీర్పును కొట్టేయండి

  • అనర్హుడిగా ప్రకటించండి.. హైకోర్టులో బీజేపీ పిటిషన్‌

హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయి కాంగ్రెస్‌ టికెట్‌పై సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీచేసిన ఖైరతాబాద్‌ శాసనసభ్యుడు దానం నాగేందర్‌ పదవిలో కొనసాగడానికి అనర్హుడని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆయన ఎన్నికను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దానం పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్‌ (పదో షెడ్యూల్‌ ట్రైబ్యునల్‌) ఇచ్చిన తీర్పును సవాలు చేశారు. ఆయన పార్టీ మారినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఏకంగా కాంగ్రెస్‌ బీ-ఫారం తీసుకుని ఎంపీగా పోటీచేశారని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల కమిషన్‌ డేటా, అఫిడవిట్‌లు అన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించడంతోపాటు ఆయన ఇప్పటివరకు తీసుకున్న జీతభత్యాలను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు.

హైకోర్టును ఆశ్రయించనున్న బీఆర్‌ఎస్‌

బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, వారు బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులే అని ఇటీవల స్పీకర్‌ ఇచ్చిన తీర్పుపైనా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కానుంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ రిట్‌ పిటిషన్‌ సిద్ధం చేస్తోంది.

Updated Date - Mar 22 , 2026 | 05:57 AM