BJP MLA Payal Shankar: ప్రాజెక్టులు పూర్తికాకపోవడం బాధాకరం
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:53 AM
ఉద్యమం ప్రారంభమైనప్పుడు వినిపించిన నీళ్లు-నిధులు-నియామకాలు నినాదం.. 12 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ వినబడుతోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు....
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఏపీకి మీరైనా సలహా ఇవ్వండి: దుద్దిళ్ల
ఉద్యమం ప్రారంభమైనప్పుడు వినిపించిన నీళ్లు-నిధులు-నియామకాలు నినాదం.. 12 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ వినబడుతోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. జూరాల దగ్గర నీళ్లను వాడుకోవడంలో బీఆర్‌ఎస్ విఫలమైందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హయాంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం ఏర్పాటుచేసిన స్ర్కీన్లలో మాత్రమే నీళ్లు పారుతున్నాయని, ప్రాజెక్టులు మాత్రం పూర్తికావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. కృష్ణా డెల్టా ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు నిర్మించొద్దని ఏపీలోని అధికార పార్టీకి మీరైనా సలహా ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారు.
నిద్రలోకి జారుకున్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు
కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, ధన్‌పాల్ నిద్రలోకి జారుకున్నారు. వారిద్దరూ నిద్రపోతున్న వీడియో డిస్‌ప్లేలో కనిపించడంతో సభ్యులతో పాటు బయట కూడా చర్చ జరిగింది.