Share News

BJP MLA Rakesh Reddy: రెండేళ్ల నుంచి సమస్యలు చెబుతున్నా పరిష్కారంకావడం లేదు

ABN , Publish Date - Jan 06 , 2026 | 02:34 AM

ప్రజాప్రతినిధిగా ఎన్నికై రెండేళ్లయింది. అసెంబ్లీకి ఎందుకొస్తున్నానో అర్థంకావడంలేదు. ఎక్కడి సమ స్యలు అక్కడే ఉన్నాయి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాకే్‌షరెడ్డి వ్యాఖ్యానించారు..

BJP MLA Rakesh Reddy: రెండేళ్ల నుంచి సమస్యలు చెబుతున్నా పరిష్కారంకావడం లేదు

  • రెండేళ్ల నుంచి సమస్యలు చెబుతున్నా పరిష్కారంకావడం లేదుఅసెంబ్లీకి ఎందుకొస్తున్నానో అర్థంకావట్లేదు

  • ఉద్యోగుల పదవీ విరమణ వయసును 64కు పెంచొద్దు: బీజేపీ ఎమ్మెల్యే రాకే్‌షరెడ్డి

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజాప్రతినిధిగా ఎన్నికై రెండేళ్లయింది. అసెంబ్లీకి ఎందుకొస్తున్నానో అర్థంకావడంలేదు. ఎక్కడి సమ స్యలు అక్కడే ఉన్నాయి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాకే్‌షరెడ్డి వ్యాఖ్యానించారు. జీరో అవర్‌ సమయంలో రాకే్‌షరెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్ల నుంచి అసెంబ్లీలో తాను చెబుతున్న సమస్యలను రాసుకున్నామని మంత్రులు చెబుతున్నారే తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని పేర్కొన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో 1998లో ఇంటికి రూ.5 చొప్పున వసూలు చేసి బస్‌ డిపో కోసం ఇస్తే దాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. ఆ స్థలం కోసం రాస్తారోకోలు చేయడంతోపాటు ప్రజలు సుప్రీంకోర్టు వరకు వెళ్లారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు నామమాత్రంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 64 ఏళ్లకు పెంచుతారనే చర్చ జరుగుతోందని, పదవీ విరమణ వయసును పెంచొద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతున్నట్టు ఎవరు చెప్పారంటూ ఎమ్మెల్యే రాకే్‌షరెడ్డిని అడిగారు. అలాంటి చర్చే ప్రభుత్వంలో జరగలేదన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 02:34 AM