Share News

బీఆర్‌ఎస్‌తో పొత్తు.. తప్పేంటి?

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:24 AM

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో తాము కలిసి పోటీచేస్తే తప్పేమిటి? అని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో కలిసి పోటీచేయడం..

బీఆర్‌ఎస్‌తో పొత్తు.. తప్పేంటి?

  • నడిచేందుకు ఓ కాలు ఇబ్బందిగా ఉంటే మరొకరి సాయం తీసుకుంటాం కదా!

  • మీడియాతో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో తాము కలిసి పోటీచేస్తే తప్పేమిటి? అని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో కలిసి పోటీచేయడం.. విడిపోవడం సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం, అసెంబ్లీ లాబీలో రాకేశ్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ‘గతంలో మేం టీడీపీతో కలిసి పోటీచేశాం.. ఆ తర్వాత విడిపోయాం.. మళ్లీ కలిసి పోటీచేయడమే కాకుండా కేంద్రంలో, ఏపీలో అధికారంలో ఉన్నాం. ఇప్పుడు తెలంగాణాలో కూడా బీఆర్‌ఎ్‌సతో కలిసి పోటీచేస్తే అధికారంలోకి రావొచ్చు. నడవడానికి మనకు ఒక కాలు ఇబ్బందిగా ఉన్నప్పుడు తాత్కాలికంగా మరొకరి సాయం తీసుకుంటాం.. రాజకీయాల్లో కూడా మనం నిలదొక్కుకునేందుకు మరొకరి సాయం తీసుకుంటే తప్పులేదు కదా’ అని రాకేశ్‌రెడ్డి అన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 04:24 AM