Share News

వారంలో రాష్ట్రానికి నితిన్‌ నబిన్‌

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:30 AM

రాష్ట్రంలో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ముమ్మర కార్యక్రమాలకు సన్నద్ధమవుతోంది. ‘మిషన్‌ తెలంగాణ’ పేరిట రాష్ట్ర పార్టీ నాయకత్వానికి...

వారంలో రాష్ట్రానికి నితిన్‌ నబిన్‌

  • మూడు రోజుల పాటు పర్యటన

  • బెంగాల్‌ తరహా కార్యాచరణ అమలు!

హైదరాబాద్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం ముమ్మర కార్యక్రమాలకు సన్నద్ధమవుతోంది. ‘మిషన్‌ తెలంగాణ’ పేరిట రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, క్యాడర్‌కు కార్యక్రమాలను నిర్దేశించబోతోంది. ‘తెలంగాణలో బెంగాల్‌ తరహా కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ఈనెల 17లోపు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇటీవల రైతుగోస.. బీజేపీ భరోసా యాత్ర పేరిట నిర్వహించిన బస్సుయాత్రకు స్పందన లభించడంతో ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై పోరాటం నిర్వహించాలని నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు, పార్టీ నియమావళిని అతిక్రమించినవారిపై కఠినంగా వ్యవహరించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రధాని మోదీ 12 ఏళ్ల పరిపాలనపై పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాలతో మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్ర పర్యటనకు రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jun 10 , 2026 | 04:30 AM