ఫూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ పాలన
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:26 AM
నాడు జ్యోతిబా ఫూలే ఏ సామాజిక మార్పు కోసం పరితపించారో, నేడు ప్రధాని మోదీ ప్రభుత్వం ఆ ఆశయాలకు అనుగణంగా పని చేస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు....
మహిళా సాధికారత దిశగా అడుగులు: ఎంపీ లక్ష్మణ్
అణచివేతపై తిరుగుబాటు బావుటా ఫూలే: బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): నాడు జ్యోతిబా ఫూలే ఏ సామాజిక మార్పు కోసం పరితపించారో, నేడు ప్రధాని మోదీ ప్రభుత్వం ఆ ఆశయాలకు అనుగణంగా పని చేస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు వెళ్తుందని బలంగా నమ్మిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. కాగా, అణచివేతపై తిరుగుబాటు బావుటా, బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యం.. జ్యోతిరావు ఫూలే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫూలే చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత సంజయ్ మాట్లాడుతూ ఫూలే ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.