డ్రగ్స్ కేసులో ‘సిట్’తో ఒరిగేదేమీ లేదు
ABN , Publish Date - Mar 19 , 2026 | 03:47 AM
డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిజన ‘సిట్’తో ఒరిగేదేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు
నల్లగొండ టౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిజన ‘సిట్’తో ఒరిగేదేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ ఉత్త మాటలేనని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌ్‌సకు డ్రగ్స్ ఎలా వచ్చాయో తేల్చాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందే ఇక్కడా జరుగుతోందని ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరమన్నారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు బ్రాహ్మణ సమాజం, హిందువులపై చేసిన వ్యాఖ్యలను రాంచందర్‌రావు తీవ్రంగా ఖండించారు.