Share News

బీజేపీకి రూ.3,157 కోట్ల విరాళాలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:38 AM

కేంద్రంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.3,157 కోట్ల విరాళాలు స్వీకరించింది...

బీజేపీకి రూ.3,157 కోట్ల విరాళాలు

  • ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా లభించిన మొత్తం

  • రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 82ు కమలం పార్టీకే.. ఏడీఆర్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కేంద్రంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.3,157 కోట్ల విరాళాలు స్వీకరించింది. దేశంలోని రాజకీయపార్టీలకు లభించిన మొత్తం విరాళాల్లో ఇది 82 శాతం. అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలున్నాయి. దీని ప్రకారం.. రిజిస్టరైన 20 ఎలక్టోరల్‌ ట్రస్టుల్లో 10 ట్రస్టులు తమకు లభించిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి (ఈసీకి) సమర్పించాయి. మరో ఐదు తమకు విరాళాలే రాలేదని తెలిపాయి. మిగిలిన 5 ట్రస్టులు ఈసీకి వివరాలు సమర్పించలేదు (గడువు ముగిసి 3నెలలు గడుస్తున్నప్పటికీ). 2024-25లో కార్పొరేషన్లు, వ్యక్తుల నుంచి ఎలక్టోరల్‌ ట్రస్టులు మొత్తంగా రూ.3,826 కోట్ల విరాళాలు స్వీకరించాయి. వివిధ రాజకీయ పార్టీలకు రూ.3,826 కోట్లను అందజేశాయి. వీటిలో సింహభాగం బీజేపీకి లభించగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రె్‌సకు రూ.298 కోట్లు (7.8ు), తృణమూల్‌ కాంగ్రె్‌సకు రూ.102 కోట్లు (2.6ు) దక్కాయి. మరో 19 ఇతర పార్టీలకు కలిపి రూ.267 ఓట్లు లభించాయి. విరాళాలు ఇచ్చిన సంస్థల్లో రూ.500 కోట్లతో ఎలివేటెడ్‌ ఎవెన్యూ రియాల్టీ ప్రథమ స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో టాటా సన్స్‌ (రూ.217 కోట్లు), టీసీఎ్‌స(రూ.217 కోట్లు), మెగా ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (రూ.175 కోట్లు) ఉన్నాయి. రంగాల వారీగా.. తొలి మూడు స్థానాల్లో తయారీరంగం (రూ.1063 కోట్లు), రియల్‌ ఎస్టేట్‌ (రూ.629 కోట్లు), ఐటీ/టెలికాం (రూ.451 కోట్లు) ఉన్నాయి. ఏ రాష్ట్రం నుంచి ఎంత విరాళాలు లభించాయన్నదానికొస్తే.. రూ.1,225 కోట్లతో మహారాష్ట్ర ప్రథమస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో తెలంగాణ (రూ.358 కోట్లు), హరియాణా (రూ.212 కోట్లు) ఉన్నాయి.

Updated Date - Feb 14 , 2026 | 03:38 AM