6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:53 AM
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కారు వైఫల్యంపై చర్చకు పట్టుబట్టాలని బీజేఎల్పీ సమావేశం నిర్ణయించింది...
హామీల అమలులో వైఫల్యం, వెలుగుమట్లపై చర్చకు పట్టుబడదాం.. బీజేఎల్పీ భేటీలో నిర్ణయం
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కారు వైఫల్యంపై చర్చకు పట్టుబట్టాలని బీజేఎల్పీ సమావేశం నిర్ణయించింది. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేయనున్నది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతపైనా చర్చించాలని కోరాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన బీజేఎల్పీ సమావేశం అభిప్రాయపడింది. సమావేశానికి హాజరైన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మండలిలో బీజేపీ నేత ఎ.వి.ఎన్.రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.