పొత్తులపై ప్రకటన చేసే అధికారం రాంచందర్‌రావుదే: ఏలేటి
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:05 AM
ఎన్నికల పొత్తులపై ప్రకటన చేసే అధికారం తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకే ఉందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు
తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ!: రఘునందన్‌రావు
హైదరాబాద్, మార్చి25(ఆంధ్రజ్యోతి): ఎన్నికల పొత్తులపై ప్రకటన చేసే అధికారం తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకే ఉందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘బీఆర్‌ఎ్‌సతో పొత్తు.. తప్పేంటి?’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం ఆయన స్పందించారు. పొత్తులపై ప్రకటన చేసే అధికారం బీజేపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులకే ఉందని స్పష్టం చేశారు. కాగా, పొత్తులపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతీ పోలింగ్ బూత్‌ను తాము సొంతంగానే గెలుచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో కూడా ఒంటరిగానే పోటీచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పొత్తులపై మాట్లాడాల్సిన సమయం, సందర్భం ఇది కాదని అన్నారు.