బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైఖరితోనే.. రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మహత్యలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:02 AM
గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు
బీజేపీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా
కవాడిగూడ, .జనవరి 27 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దాదాపు 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద జీజేపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో రాంచందర్‌రావు, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో లేవని, రాష్ట్రంలోనే ఈ దుస్థితి ఉందని మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన రూ.2వేల కోట్లకు పైగా నిధులు పెండింగ్‌లో ఉండడం దారుణమన్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సోయిలేకుండా వ్యవహరిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు.