Share News

ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే విజయం

ABN , Publish Date - May 01 , 2026 | 05:39 AM

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే విజయం

  • 10న హైదరాబాద్‌లో మోదీ బహిరంగ సభ

  • రాష్ట్రంలో పొత్తులుండవు.. ఒంటరి పోరే: ఎంపీ లక్ష్మణ్‌

కరీంనగర్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై పెరుగుతున్న ప్రజాభిమానానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ ఎవరితో పొత్తులు ఉండవని, ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. కేసీఆర్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యనే లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. మోదీ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించనున్నాయన్నారు.

Updated Date - May 01 , 2026 | 05:39 AM